+91 99635 77856

డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదకరం

Kudikala Sai Editor
maaksharamnews.in

డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదకరం

-డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదకరం...

-అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి...

-ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి...

హుజురాబాద్/ ఏప్రిల్ 05 (మా అక్షరం):హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్ష ఆదివారం 14వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల లక్షలాది మంది ప్రజల జీవితం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికపై కూర్చుంటే ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల సమస్యలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.
డంపింగ్ యార్డ్‌ను ఈ ప్రాంతం నుంచి ఎత్తివేయాలనే డిమాండ్‌తో ఈ నెల 7, 8 తేదీల్లో తానే దీక్షలో కూర్చుంటానని ప్రకటించారు. ఇందుకోసం మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లి పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తానని తెలిపారు.డంపింగ్ యార్డ్ కరోనా కంటే భయంకరమైందని పేర్కొన్న ఆయన, ఈ నెల 9న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులను కోరారు. ఆ సమావేశానికి బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ శాసనసభ్యులు మల్కాజ్‌గిరి ఎంపీ కూడా పాల్గొనాలని సూచించారు.ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల చెత్తను ఇక్కడికి తరలించడం సరైంది కాదన్నారు.డంపింగ్ యార్డ్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేసే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

-డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదకరం…

-అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి…

-ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

హుజురాబాద్/ ఏప్రిల్ 05 (మా అక్షరం):హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్ష ఆదివారం 14వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీక్షా శిబిరానికి చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల లక్షలాది మంది ప్రజల జీవితం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికపై కూర్చుంటే ప్రభుత్వానికి ఇక్కడి ప్రజల సమస్యలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.
డంపింగ్ యార్డ్‌ను ఈ ప్రాంతం నుంచి ఎత్తివేయాలనే డిమాండ్‌తో ఈ నెల 7, 8 తేదీల్లో తానే దీక్షలో కూర్చుంటానని ప్రకటించారు. ఇందుకోసం మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లి పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తానని తెలిపారు.డంపింగ్ యార్డ్ కరోనా కంటే భయంకరమైందని పేర్కొన్న ఆయన, ఈ నెల 9న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులను కోరారు. ఆ సమావేశానికి బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ శాసనసభ్యులు మల్కాజ్‌గిరి ఎంపీ కూడా పాల్గొనాలని సూచించారు.ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల చెత్తను ఇక్కడికి తరలించడం సరైంది కాదన్నారు.డంపింగ్ యార్డ్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేసే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !