+91 99635 77856

ఆర్టిసన్, అన్మాన్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఈ నెల 7న ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ భవన్ వద్ద మహా ధర్నా…
-ఎండి అమనుల్లా, టీవీఏఈ జేఏసీ ట్రాన్స్కో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ…

హుజురాబాద్, ఏప్రిల్ 05 (మా అక్షరం):టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన సమ్మె కార్యాచరణలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని టీవీఏఈ జేఏసీ ట్రాన్స్కో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి అమనుల్లా పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాజమాన్యం మరియు ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలకు పణంగా పెట్టి, తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని అన్నారు.సంస్థలో విలీనం అయి 8 సంవత్సరాలు గడిచినా ప్రమోషన్లు ఇవ్వకపోవడం, సంస్థలో అమలులో ఉన్న నియమాలను పాటించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆర్టిసన్ మరియు అన్మాన్డ్ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ విద్యుత్ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నా, వారి కుటుంబాలకు సరైన గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు.
వెంటనే ఆర్టిసన్ కార్మికులకు విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ కల్పించాలని, ఒకే సంస్థలో ఒకే విధమైన నియమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజా ప్రభుత్వం అని చెప్పినా, ప్రతిసారి కలవడానికి ప్రయత్నించినప్పటికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి ఉద్యమాలు చేస్తున్నా కనీసం చర్చలకు పిలవకపోవడం బాధాకరమని అన్నారు.ఈ నెల 8వ తేదీలోపు చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకపోతే, తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా విద్యుత్ కార్మికుల ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !