+91 99635 77856

యార్డు రద్దు చేసి పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

యార్డు రద్దు చేసి పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలి

హుజూరాబాద్/ఏప్రిల్ 05 (మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంప్ యార్డ్‌ను రద్దు చేయాలని వ్యతిరేకంగా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆదివారం 14వ రోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డంప్ యార్డు వ్యతిరేక దీక్షా శిబిరంలో సంఘ గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ గందె శ్రీనివాస్, అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓఆర్‌ఆర్ పక్కన ఉన్న అందమైన ప్రదేశాన్ని డంపింగ్ యార్డుగా కాకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్–వరంగల్ మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే మంచి టూరిజం స్పాట్‌గా మారే అవకాశం ఉందన్నారు.డంపింగ్ యార్డు వల్ల కాలుష్యం, దుర్వాసన, వ్యాధులు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని, పర్యాటక కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతానికి మంచి పేరు వస్తుందని తెలిపారు.డంప్ యార్డు ప్రతిపాదనను వెంటనే రద్దు చేసి, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకునే వరకు అఖిలపక్ష పోరాటానికి మద్దతు ఇస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నాయకులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !