– పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత….
హుజురాబాద్ /ఏప్రిల్ 18 (మా అక్షరం):మహిళ రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి పూర్తి బాధ్యత బిజెపి దే అని పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత పత్రిక ప్రకటనలో తెలిపారు. బిజెపి నాయకులు కావాలని చిత్తశుద్ధితో ఈ బిల్లు పెట్టలేదని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లబ్ధి పొందాలని చూసారే తప్ప మహిళా సాధికారతపై పూర్తి స్పష్టత లేదని తెలిపారు. డిలిమిటేషను బిల్లుకు మహిళా బిల్లుకు లింకు పెట్టడం కరెక్ట్ కాదని దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో కొట్లాడితే దాని పూర్తి బాధ్యత బిజెపి వహించకుండా అది కాంగ్రెస్ పార్టీపై నెట్టి మహిళలపై విద్వేషాన్ని రగిలించే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. నిజానికి మహిళా బిల్లు ప్రవేశ పెట్టడంలో అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముందడుగు వేసిందని ఆ బిల్లు అమలుకు అప్పుడు సహకరించకుండా కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బిజెపి ఉపయోగిస్తుందని మండిపడ్డారు. మహిళలకు నిజమైన న్యాయం చేకూర్చాలంటే మహిళా బిల్లును డిలిమిటేషను బిల్లును వేరువేరుగా ప్రవేశపెట్టాలని వాటి కలిపి పెట్టడం కరెక్ట్ కాదని వారు తెలిపారు. ఎన్నికలలో లబ్ధి పొందడంలో చేసిన ప్రయత్నం విఫలం కావడం వల్ల ఈరోజు రాహుల్ గాంధీ పై తెలంగాణ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారని ఈ ప్రచారాన్ని మహిళలంతా గమనిస్తున్నారని చెప్పారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెల్తామని వివరించారు. కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీ పై రేవంత్ రెడ్డి పై దుష్ప్రచారం మానుకోవాలని, బిజెపి చేస్తున్న కపట రాజకీయాన్ని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బయటపెడతామని అన్నారు












