+91 99635 77856

జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడుగా అంబాల అనిల్ కుమార్…

Kudikala Sai Editor
maaksharamnews.in

జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడుగా అంబాల అనిల్ కుమార్…

ఎల్కతుర్తి/ ఏప్రిల్ 19 (మా అక్షరం)

మండలంలోని ఆదివారం రోజున వల్బాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంబాల అనిల్ కుమార్ ను ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ ఎన్నికల సమావేశం ఉపసర్పంచుల సంఘం, రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడి కవిత ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఉపసర్పంచ్ ల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న వల్బాపూర్ గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి గతంలో వల్బాపూర్ గ్రామ సర్పంచిగా ఐదు సంవత్సరాలు సేవలు అందించారని, అదే మార్గంలో తాను కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. జిల్లా ఉపసర్పంచుల అధ్యక్ష పదవిని తనపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు మరోసారి సంఘం నాయకులకు, గ్రామ ప్రజలకు అంబాల అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !