+91 99635 77856

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికి తీసేందుకే వేసవి శిక్షణ శిబిరం

-గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికి తీసేందుకే వేసవి శిక్షణ శిబిరం…

-రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, గణేష్…

హుజురాబాద్ /మే04 (మా అక్షరం):గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికి తీసేందుకే వేసవి శిక్షణ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, గణేష్ అన్నారు.మండలంలోని రాంపూర్ గ్రామంలో సీనియర్ హాకీ క్రీడాకారుడు కోచ్ పల్లపు సాంబరాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమ్మర్ హాకీ కోచింగ్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉంటుందని, సరైన శిక్షణ మరియు ప్రోత్సాహం లభిస్తే ఆ ప్రతిభ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగగలదని పేర్కొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు క్రమశిక్షణ, ఆరోగ్యం, జట్టు భావన వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ హాకీ శిబిరంలో గ్రామానికి చెందిన బాలురు, బాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, ప్రతిరోజూ ప్రాథమిక నైపుణ్యాలు, ఫిట్‌నెస్ వ్యాయామాలు, ఆట నియమాలు నేర్పిస్తున్నట్లు కోచ్ పల్లపు సాంబమూర్తి వివరించారు. క్రీడాకారులు క్రమం తప్పకుండా సాధన చేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని ఆయన వారికి సూచించారు. అనంతరం మాటూరి సారయ్య జ్ఞాపకార్థం ఆయన మనవరాలు అవిజ్ఞ సుహాసిని లు 15 టీషర్ట్స్ క్రీడాకారులకు అందజేశారు, సీనియర్ క్రీడాకారుడు భూసారపుశంకర్ 15 టీ షర్టులను అందించారు, కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ సెక్రటరీ బొడిగ తిరుపతి, హాకీ క్లబ్ ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, పి ఈ టి లు వేముల రవికుమార్, సాదుల శ్యాం కుమార్, సీనియర్ క్రీడాకారులు, ఎండి సజ్జు, చౌడమల్ల రాజు, రాజేష్, సాయి కృష్ణ, విక్రమ్, వినయ్, పరబ్రహ్మం, వంశీ, బబ్బి, ఉప సర్పంచ్ శివాజీ, వార్డ్ మెంబర్ ఆలకుంట రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !