+91 99635 77856

ట్రాన్స్ఫార్మర్ తో పొంచి ఉన్న పెను ప్రమాదం…

-ట్రాన్స్ఫార్మర్ తో పొంచి ఉన్న పెను ప్రమాదం…

-వీధి దీపాలు ఆర్పేది ఎప్పుడు…

-సేవ్ ద ట్రీ సేవ్ ద ఎర్త్ సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు…

హుజురాబాద్/మే 06 (మా అక్షరం):పట్టణంలోని హుజురాబాద్ క్లబ్ ను ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ తో పెను ప్రమాదం పొంచి ఉందని సేవ్ ద ట్రీ సేవ్ ద ఎర్త్ సామాజిక కార్యకర్త, 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు అన్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ విద్యుత్ అధికారులు కంచ వేసినప్పటికీ లోపలికి వెళ్లే గేటు విరిగి ఉండడంతో అందులోకి పిల్లలు ఆడుతూ లోనికి వెళ్తున్నారని అన్నారు. గేటు తెరిసి ఉండడంతో పిల్లలు అందులోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వెంటనే అధికారులు ఆ గేటును మరమ్మతులు చేయించాలని కోరారు. దీంతోపాటు హుజరాబాద్ మున్సిపాలిటీలో పలు వీధుల్లో తెల్లవారిన కూడా విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉన్నాయని, రోజంతా విద్యుత్ దీపాలు వెలిగితే విద్యుత్ భారం ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా 12వ వార్డులోని రామ్ నగర్ ప్రాంతంలో వీధిలైట్లు ఎప్పుడు చూసినా వెలుగుతూనే ఉన్నాయని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి మున్సిపల్ పరిధిలోని వీధిలైట్లను సకాలంలో ఆర్పి వేయాలని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !