+91 99635 77856

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్‌లో యూరాలజీ క్యాంప్

Kudikala Sai Editor
maaksharamnews.in

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్‌లో యూరాలజీ క్యాంప్

వరంగల్/ ఆగస్టు 01 ( మా అక్షరం): మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వరంగల్ కొత్తపేటలోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల ప్రత్యేక ఉచిత యూరాలజీ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. జి. మోహన్ చంద్ ఆధ్వర్యంలో జరిగే ఈ క్యాంప్‌లో మూత్రం సమయంలో మంట, తరచుగా మూత్ర విసర్జన, మూత్రంలో రక్తం కనిపించడం, కిడ్నీ, వెన్ను నొప్పులు, కిడ్నీలో రాళ్లు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సపై సలహాలు అందించనున్నారు.క్యాంప్ సందర్భంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC), షుగర్ పరీక్ష, కంప్లీట్ యూరిన్ పరీక్ష, క్రియాటినిన్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు, వైద్యుల సలహా మేరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇతర వైద్య పరీక్షలపై 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కిడ్నీ సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచించారు.అపాయింట్‌మెంట్ కోసం: 94598 75555.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !