హుజురాబాద్/ ఆగస్టు 03(మా అక్షరం): పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో సోమవారం బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, యువత వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.అనంతరం హౌస్ ఎలక్షన్స్‌లో విజేతలైన కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను సన్మానించడంతో పాటు ఎఫ్‌ఏ–1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పోతరాజుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.













