హుజురాబాద్, ఆగస్టు 11 (మా అక్షరం): హుజురాబాద్ నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ బృందం గురువారం (ఆగస్టు 13న) పర్యటించనుంది. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ నేతృత్వంలో ఈ పర్యటన నిర్వహించనున్నట్లు రాష్ట్ర కమిటీ కార్యదర్శి కుడికాల సాయి తెలిపారు.నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ సౌకర్యాలు, ఉత్పత్తి వివరాలు, నిల్వ ఉన్న వస్త్రాలు, జియో ట్యాగింగ్ విధానం, త్రిఫ్ట్ ఫండ్, నేతన్న భీమా, చేనేత మిత్ర తదితర పథకాల అమలు తీరును బృందం పరిశీలించనుంది. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.ఈ పర్యటనలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులతో పాటు పద్మశాలి సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
Post Views: 90













