ఇల్లందకుంట /ఆగస్టు 10 (మా అక్షరం): దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ బీజేపీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గుత్తికొండ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని‘భారత్ మాతాకీ జై‘వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా గుత్తికొండ రాంబాబు, మట్ట పవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ ఐక్యత, అఖండత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల రమేష్, ఇంగ్లే ప్రభాకర్, ఏనుగు సురేందర్‌రెడ్డి, తుపాకుల సతీష్, ఉప్పు దుర్గయ్య, సోమిడి సురేందర్, చింతల ఐలయ్య, సామల కర్ణాకర్‌రెడ్డి, జిల్లెల శ్రీపాల్‌రెడ్డి, మద్దూరి మల్లేష్, అసాలా సుధాకర్, చదువు సాయిరెడ్డి, చిట్ల శ్రీనివాస్, మురహరి గోపాల్, రావుల అశోక్, ఎలేవెని శ్రీధర్, పిట్టల రాజు, బోయిని శివకృష్ణ, చిలుక రాజు తదితరులు పాల్గొన్నారు.













