+91 99635 77856

దివ్యాంగుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న మమత ట్రస్ట్

Kudikala Sai Editor
maaksharamnews.in

దివ్యాంగుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న మమత ట్రస్ట్

- దివ్యాంగులకు నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్న మమత ట్రస్ట్...

-సమాజ పరివర్తనకు ఆదర్శంగా నిలుస్తున్న డా. సునీల్ కథ్రమల్ల సేవా... 

హైదరాబాద్/ ఆగస్టు 10(మా అక్షరం): దివ్యాంగులు, వారి కుటుంబాలు, పేదలు, గ్రామీణ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మమత ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని ట్రస్ట్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డా. సునీల్ కథ్రమల్ల తెలిపారు. అమెరికాలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఆరోగ్య, సామాజిక సేవా రంగాల్లో పనిచేసిన ఆయన.. స్వదేశానికి సేవ చేయాలనే సంకల్పంతో 2017లో మమత ట్రస్ట్‌ను స్థాపించారు.

దివ్యాంగులకు వైద్యం, పునరావాసం, విద్య, శిక్షణ, సాధికారతతో పాటు సహాయక పరికరాలను అందిస్తూ వేలాది మందికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గౌరవం, అందుబాటు, సమాన అవకాశాలు, సమగ్ర భాగస్వామ్యం అనే విలువలతో సంస్థ పనిచేస్తోందన్నారు.

మూడు ‘ఈ’లతో సేవా తత్వం

దివ్యాంగులను సమాజంలో గౌరవంగా స్వీకరించడం ‘ఎంబ్రేస్‌’, జ్ఞానం, నైపుణ్యాలు, పునరావాస సేవలతో సాధికారత కల్పించడం ‘ఎంపవర్‌’, సమాజ నిర్మాణంలో సమాన భాగస్వామ్యం కల్పించడం ‘ఎంగేజ్‌’ అనే మూడు ప్రధాన సూత్రాలతో ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో అవగాహన కార్యక్రమాలు, జాతీయ సదస్సులు, శిక్షణా శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. వైద్యులు, ఉపాధ్యాయులు, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, ప్రత్యేక విద్యావేత్తలు, ఫిజియోథెరపిస్టులు, స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజిస్టులు, ఆడియాలజిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వేలాది మంది పిల్లలు, యువత, కుటుంబాలకు స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజీ, ఆడియాలజీ సేవలతో పాటు వినికిడి పరీక్షలు, హియరింగ్‌ ఎయిడ్స్‌, వీల్‌చైర్లు, వాకర్లు, క్రచ్‌లు తదితర సహాయక పరికరాలను ఉచితంగా లేదా రాయితీపై అందించినట్లు తెలిపారు.

హుజూరాబాద్‌లో మెగా వైద్య శిబిరం

హుజూరాబాద్‌లోని సీఎస్‌ఐ సెయింట్‌ పాల్స్‌ చర్చిలో ఇటీవల నిర్వహించిన మెగా మెడికల్‌, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిర్వహించిన ఈ శిబిరంలో 131 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. 39 మంది వైద్యులు, నిపుణులు, ఆడియాలజిస్టులు, స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజిస్టులు, స్వచ్ఛంద సేవకులు సేవలందించారు. మొత్తం 170 మంది కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.మమత ట్రస్ట్‌, ఆశ్రయం హ్యాండ్‌ ఆఫ్‌ హోప్‌, హియర్జాప్‌, టీఏఎస్‌ఎల్‌పీఏ సంస్థల సహకారంతో నిర్వహించిన శిబిరంలో సాధారణ వైద్యం, స్పీచ్‌, హియరింగ్‌ పరీక్షలు, కంటి, దంత, మహిళల ఆరోగ్య పరీక్షలు, ప్రయోగశాల పరీక్షలు, ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, ఉచిత మందులు, హియరింగ్‌ ఎయిడ్‌ సేవలు అందించారు.

దివ్యాంగులు సమాజంలో సమాన భాగస్వాములు

దివ్యాంగులు కేవలం సేవలు పొందే వ్యక్తులు కాదని, సమాజ నిర్మాణంలో సమాన భాగస్వాములు, నాయకులు, విలువైన పౌరులని డా. సునీల్‌ కథ్రమల్ల పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని మెగా వైద్య, స్పీచ్‌, హియరింగ్‌ శిబిరాలు, పునరావాస కార్యక్రమాలు, శిక్షణా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

– దివ్యాంగులకు నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్న మమత ట్రస్ట్…

-సమాజ పరివర్తనకు ఆదర్శంగా నిలుస్తున్న డా. సునీల్ కథ్రమల్ల సేవా… 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !