+91 99635 77856

పర్యావరణ వేత్త రవీందర్‌రావుకు ఘన సన్మానం

Kudikala Sai Editor
maaksharamnews.in

పర్యావరణ వేత్త రవీందర్‌రావుకు ఘన సన్మానం

హుజురాబాద్/ ఆగస్టు 10 (మా అక్షరం): వివిధ ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ, సామాజిక కార్యకర్త, మున్సిపల్ కౌన్సిలర్ వర్దినేని రవీందర్‌రావును ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన, బీసీ ఆజాద్ ఫెడరేషన్, ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్, చేనేత సంఘాల ప్రతినిధులు ఆయనను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని రవీందర్‌రావు సమాజసేవ చేస్తున్నారని కొనియాడారు. పేద విద్యార్థుల విద్య, ఉపాధి అవకాశాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమ్మయ్య, డివిజన్ అధ్యక్షుడు రామగిరి అంకుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంతడుగుల బాబు, బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకుడు చిలుకమూరి శ్రీనివాస్, పద్మశాలి సంఘం నాయకుడు సంగం సత్యనారాయణ, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ల శేఖర్, బీసీ సంక్షేమ సంఘం మహిళా జనరల్ సెక్రటరీ ప్రియదర్శిని, ఆర్టీఐ చట్టం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లూరు రాజేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు రుద్రారపు రామచంద్రం, శ్రీనివాస్, వసంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకుడు తునికి సమ్మయ్య, చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షురాలు బింగి రాణి, సృజన, చల్లూరు నిరోషా, షాదిక్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !