-కాంగ్రెస్ నేత గూడూరు స్వామి రెడ్డి తీరుపై మండిపడ్డ హుజురాబాద్ జర్నలిస్టులు..
-రేపటి నుంచి ఆందోళనలకు పిలుపు…
హుజురాబాద్/ ఆగస్టు 11( మా అక్షరం): హుజురాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల వివాదంపై స్పందించడానికి నిరాకరించడమే కాకుండా,స్వపక్ష ప్రభుత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు గూడూరి స్వామి రెడ్డి వైఖరిని నిరసిస్తూ రేపటి నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శి కాయిత రాములు,కామని రవీందర్ లు ప్రకటించారు.గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలపై స్వామి రెడ్డి కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో, సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆయన స్వగ్రామమైన ఇప్పల నర్సింగాపూర్ లో ని ఆయన గృహానికి వెళ్లి బొకే ఇచ్చి విజ్ఞప్తి చేశారు.అయితే,కేసును ఉపసంహరించుకోవడానికి ఆయన నిరాకరించినట్లు వారు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే గూడూరు స్వామి రెడ్డి స్పందిస్తూ… “ఇదో చెత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వంతో పనులు అయ్యేది లేదు.. పోయేది లేదు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వారు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని రకాల ప్రయోజనాలు పొందిన స్వామి రెడ్డి, సొంత ప్రభుత్వంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వచ్చాక తన సతీమణి గూడూరు రాజేశ్వరిని మార్కెట్ చైర్మన్‌గా నామినేట్ చేయించుకోవడంతో పాటు, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కోడలు గూడూరు మంజుల ను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబుతో పాటు మంత్రుల సహకారాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నారని జర్నలిస్టులు గుర్తుచేశారు.సొంత పదవుల కోసం ప్రభుత్వాన్ని వాడుకుని, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో మాత్రం పట్టుదలకు పోతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది.బొకే ఇవ్వడానికి వెళ్లిన జర్నలిస్ట్ ప్రతినిధుల పట్ల ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు,కార్యదర్శి కామని రవీందర్ లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు కోరం సుధాకర్ రెడ్డి,నంబీ భరణికుమార్,కేదాసి శ్రీధర్,టేకుల సాగర్,ఎడ్ల కుమార్,నిమ్మటూరి సాయి కృష్ణ, పబ్బతిరుపతి,మచ్చిక చందు,గొపగాని మహేష్, ఎన్ టివి రాజు, పోతరాజు సంపత్,నాగవెల్లి రాజు,పయిమ్, భారత రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.













