-కౌశిక్ రెడ్డిని టచ్ చేసి చూడు..
-పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే.. నడి బజార్లో నిలబెట్టి చెప్పులతో కొడతాం..
-డ్రాయర్ పై పరిగెత్తిస్తాం..
–ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?
–BRS పార్టీ సీనియర్ నాయకులు తక్కళ్లపళ్లి సత్యనారాయణ రావు…
కమలాపూర్/ ఆగస్టు 11 (మా అక్షరం): ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది.. ప్రశ్నిస్తే రాళ్లతో కొడతారా? ఇదెక్కడి పద్ధతి.. ఇదెక్కడి సంస్కారం.. గొప్ప వాళ్లకు రాజకీయవారసునిగా చెప్పుకుని చేసేది ఇదేనా? వాళ్లు ఇదే నీకు నేర్పారా? అని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం కమలాపూర్ మండలం లో బిఆర్ఎస్ నేతలు తక్కళ్లపళ్లి సత్యనారాయణ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై రాళ్ల దాడి చేస్తామని కాంగ్రెస్ నాయకుడు ప్రకటించడానికి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను ప్రశ్నిస్తున్నారు.. కమలాపూర్ లో సోమవారం జరిగిన మంత్రుల సభలో వారు చెప్పిన అబద్ధాలను సభ వేదికగా ఖండించారు.. ఇందులో తప్పేముంది అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రశ్నిస్తాం.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తాం.. అయితే రాళ్లతో కొడతావా ఎంత ధైర్యం నీకు అని వారు ప్రశ్నించారు. రాళ్లతో కొడితే చూస్తూ ఊరుకుంటామా.. కౌంటర్ గా నిన్ను చెప్పులతో కొడతాం.. ఉరికించుకుంటూ కొడతాం.. నియోజకవర్గ పొలి మేరకు అడుగుపెట్టకుండా అంతు చూస్తాం.. అని వారు హెచ్చరించారు. నువ్వు నిజంగానే రాళ్ల దాడి చేసి చూడు.. నీ బట్టలు హుజురాబాద్ అంబేద్కర్ దగ్గర విప్పి డ్రాయర్ మీద నిలుచోబెడతాం అని వారు సవాల్ చేశారు. పిచ్చిపిచ్చి కూతలు కూయొద్దు అంటూ హెచ్చరించారు. పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఇస్తున్న రాళ్లతో కొట్టాలన్న స్టేట్మెంట్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అడుగడుగునా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకునే పోలీస్ అధికారులు ఎక్కడ అని ప్రశ్నించారు. రాళ్ల దాడి చేస్తామన్న నేతలను వెంటనే కేసుల నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలవని నువ్వు.. సింహం లాంటి కౌశిక్ రెడ్డి పై రాళ్ల దాడి చేస్తా అంటూ విమర్శలు చేస్తావా అంటూ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ముందు తొడ కొట్టడం అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేయడమే అని ఎద్దేవా చేశారు. నువ్వు కాదు కదా నీ జేజమ్మ దిగివచ్చిన కౌశిక్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేవని మండిపడ్డారు. వ్యక్తిగత ఇమేజ్ లేక కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుగా.. నియోజకవర్గంలో అధికార పార్టీ పేరు చెప్పుకొని పబ్బం గడుపు నువ్వు కౌశిక్ రెడ్డి పై దాడి చేస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా బి ఆర్ ఎస్ హయాంలో కెసిఆర్ హయాంలోనే జరిగిందన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఒక పవర్ స్టేషన్ ఆయనను ముట్టుకుంటే మాడి మసైపోతావు అని అన్నారు. సర్కస్ లో జోకర్ పాత్ర నీది.. అలాగే ఉండు.. అలాగే కలలు కను.. నీవు కలలోనే ఎమ్మెల్యేవు.. జీవితంలో ఏనాడూ ఎమ్మెల్యే కాలేవు.. రాసి పెట్టుకో అని వారు హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి పేరు వింటేనే.. నీకు దడ పుడుతుంది.. మీ గజ్జలు వణుకుతున్నాయి.. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీశారు.. ప్రభుత్వాన్ని నిలదీశారు.. మంత్రులను నిలదీశారు. నువ్వెంత నీ లెక్కెంత.. కౌశిక్ రెడ్డి ని తిడితే పెద్దోన్ని అయిపోతా అనుకుంటున్నావు.. కానీ వార్డు మెంబర్ కౌన్సిలర్ కూడా కాలేవు.. అని విమర్శించారు. ప్రెస్ మీట్ లలో.. జబర్దస్త్ కామెడీ షో డైలాగులు తప్ప.. నీతో ఊదు కాలదు పీరీలేవదు.. ఇది హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ప్రజాస్వామ్యతంగా.. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజానాయకుడి పైనే రాళ్లతోదాడి చేస్తామని ప్రకటించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు.













