-అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి…
-మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ…
హుజురాబాద్/ఆగస్టు 11 (మా అక్షరం): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే పంపిణీ చేయాలని హుజురాబాద్ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వన్నాల శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులను ఎంపిక చేసి హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇదే విధంగా హుజురాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా అర్హులైన నిరుపేదలకు వెంటనే కేటాయించాలని కోరారు. హుజురాబాద్ మండలంలోని 20 గ్రామాల ఉప సర్పంచ్‌ల తరఫున ఈ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు వన్నాల శివాజీ తెలిపారు.













