+91 99635 77856

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

హుజురాబాద్/ ఆగస్టు 18 (మా అక్షరం): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హుజురాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమాజంలో ఐక్యత, సమానత్వం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి మామునూరి ప్రవీణ్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగం సత్యనారాయణ, చేనేత ఐక్యవేదిక మహిళా ఉపాధ్యక్షురాలు దేవసాని ప్రియదర్శిని, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, పద్మశాలి సంఘం నాయకులు మార్త రవీందర్, మంచికట్ట్ల కమలాకర్, కుడికాల ప్రభాకర్, పిట్ట శ్రీనివాస్, చంద్రగిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !