+91 99635 77856

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు బీఎస్పీ పూర్తి మద్దతు.

Kudikala Sai Editor
maaksharamnews.in

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు బీఎస్పీ పూర్తి మద్దతు.

-బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్...

-ఐదో రోజుకు చేరిన నిరసన దీక్ష..

-నల్ల బెలూన్లు ఎగరేసి జర్నలిస్టుల వినూత్న నిరసన...

హుజూరాబాద్/ ఆగస్టు 20 (మా అక్షరం): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం సాగుతున్న న్యాయపోరాటం, సామాజిక ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.ఈ దీక్షా శిబిరాన్ని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్,బి ఎస్పీ నాయకులు,ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య సందర్శించి జర్నలిస్టుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

​కలిసికట్టుగా పోరాడితేనే హక్కుల సాధన...

ఈ సందర్భంగా పల్లె ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. హక్కుల సాధనకు ఐక్య పోరాటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ‘చలి చీమలు ఏకమై పెద్ద పామును సైతం అంతమొందించినట్లుగా’ జర్నలిస్టులంతా ఏకతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు.​జర్నలిస్టుల నిరంతర ప్రజాసేవను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ ప్లాట్లను మంజూరు చేసిందని, ఇవి ఏ ఒక్క రాజకీయ పార్టీయో ఇచ్చినవి కావని గుర్తుచేశారు.
​ రాజకీయ వైషమ్యాలు ఏవైనా ఉంటే ఎన్నికల బరిలో తేల్చుకోవాలే తప్ప, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

​కలాలకు ఈ దుస్థితి రావడం విచారకరం...

నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తి, పాలకుల దృష్టికి తీసుకెళ్లే కలాలే నేడు తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కి దీక్షలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు.జర్నలిస్టుల న్యాయమైన సమస్యలపై స్పందించని నాయకులు, రాజకీయ పార్టీల వార్తలను పూర్తిగా బహిష్కరించాలని సూచించారు. జర్నలిస్టుల సహాయ నిరాకరణను ఎదుర్కొని ఏ నాయకుడూ రాజకీయంగా మనుగడ సాగించలేరని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రణవ్ కేవలం ముఖ్యమంత్రికి, అధిష్టానానికి శుభాకాంక్షలు తెలపడానికే పరిమితం కాకుండా, ఈ వివాదాన్ని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

​జర్నలిస్టుల ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర...
- కొలిపాక సమ్మయ్య

ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత గూడూరు స్వామి రెడ్డి జర్నలిస్టుల న్యాయమైన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తూ పన్నాగం పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పల నర్సింగాపూర్, దమ్మక్కపేట గ్రామాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలు గ్రామానికి చెందినవంటూ వారిలో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల ప్రజలు ఆయన మాయమాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

​హోరెత్తిన నినాదాలు.. నల్ల బెలూన్లతో నిరసన...

ఐదో రోజు నిరసనలో భాగంగా జర్నలిస్టులు ఆకాశంలోకి నల్ల బెలూన్లను ఎగురవేసి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ నేత గూడూరు స్వామి రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.తక్షణమే జర్నలిస్టుల స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని, "మా స్థలాలు మాకు ఇవ్వాలి.. మా హక్కులు కాపాడాలి" అంటూ నినదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కళాకారుల ఆటపాటలు, గేయాలు దీక్షా శిబిరంలో పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు, బీఎస్పీ నాయకులు గిన్నారపు మహేందర్, వేల్పుల మల్లేష్, అంబాల ప్రభాకర్,ఇల్లందుల రమేష్, మంద సమ్మయ్య,దొడ్డ సమ్మయ్య,జేఏసీ నాయకులు వేల్పుల రత్నం,చందుపట్ల జనార్ధన్,ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్…

-ఐదో రోజుకు చేరిన నిరసన దీక్ష..

-నల్ల బెలూన్లు ఎగరేసి జర్నలిస్టుల వినూత్న నిరసన…

హుజూరాబాద్/ ఆగస్టు 20 (మా అక్షరం): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం సాగుతున్న న్యాయపోరాటం, సామాజిక ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.ఈ దీక్షా శిబిరాన్ని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్,బి ఎస్పీ నాయకులు,ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య సందర్శించి జర్నలిస్టుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

కలిసికట్టుగా పోరాడితేనే హక్కుల సాధన…

ఈ సందర్భంగా పల్లె ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. హక్కుల సాధనకు ఐక్య పోరాటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ‘చలి చీమలు ఏకమై పెద్ద పామును సైతం అంతమొందించినట్లుగా’ జర్నలిస్టులంతా ఏకతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు.​జర్నలిస్టుల నిరంతర ప్రజాసేవను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ ప్లాట్లను మంజూరు చేసిందని, ఇవి ఏ ఒక్క రాజకీయ పార్టీయో ఇచ్చినవి కావని గుర్తుచేశారు.
​ రాజకీయ వైషమ్యాలు ఏవైనా ఉంటే ఎన్నికల బరిలో తేల్చుకోవాలే తప్ప, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలాలకు ఈ దుస్థితి రావడం విచారకరం…

నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తి, పాలకుల దృష్టికి తీసుకెళ్లే కలాలే నేడు తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కి దీక్షలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు.జర్నలిస్టుల న్యాయమైన సమస్యలపై స్పందించని నాయకులు, రాజకీయ పార్టీల వార్తలను పూర్తిగా బహిష్కరించాలని సూచించారు. జర్నలిస్టుల సహాయ నిరాకరణను ఎదుర్కొని ఏ నాయకుడూ రాజకీయంగా మనుగడ సాగించలేరని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రణవ్ కేవలం ముఖ్యమంత్రికి, అధిష్టానానికి శుభాకాంక్షలు తెలపడానికే పరిమితం కాకుండా, ఈ వివాదాన్ని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర…
– కొలిపాక సమ్మయ్య

ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత గూడూరు స్వామి రెడ్డి జర్నలిస్టుల న్యాయమైన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తూ పన్నాగం పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పల నర్సింగాపూర్, దమ్మక్కపేట గ్రామాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలు గ్రామానికి చెందినవంటూ వారిలో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల ప్రజలు ఆయన మాయమాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

హోరెత్తిన నినాదాలు.. నల్ల బెలూన్లతో నిరసన…

ఐదో రోజు నిరసనలో భాగంగా జర్నలిస్టులు ఆకాశంలోకి నల్ల బెలూన్లను ఎగురవేసి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ నేత గూడూరు స్వామి రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.తక్షణమే జర్నలిస్టుల స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని, “మా స్థలాలు మాకు ఇవ్వాలి.. మా హక్కులు కాపాడాలి” అంటూ నినదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కళాకారుల ఆటపాటలు, గేయాలు దీక్షా శిబిరంలో పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు, బీఎస్పీ నాయకులు గిన్నారపు మహేందర్, వేల్పుల మల్లేష్, అంబాల ప్రభాకర్,ఇల్లందుల రమేష్, మంద సమ్మయ్య,దొడ్డ సమ్మయ్య,జేఏసీ నాయకులు వేల్పుల రత్నం,చందుపట్ల జనార్ధన్,ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !