+91 99635 77856

జర్నలిస్టుల పొట్టకొట్టే కుట్రలను సహించేది లేదు

Kudikala Sai Editor
maaksharamnews.in

జర్నలిస్టుల పొట్టకొట్టే కుట్రలను సహించేది లేదు

- సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి...

-​హుజూరాబాద్‌లో 4వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు...

-​ఇళ్ల స్థలాల వివాదాన్ని పరిష్కరించకుంటే ప్రత్యక్ష పోరాటం తప్పదు...

-​మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని డిమాండ్..

హుజూరాబాద్/ ఆగస్టు 19 (మా అక్షరం):
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల పొట్టకొట్టేలా అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, కలం కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హుజూరాబాద్ పట్టణంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో కేసు వేసి వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని వాసుదేవరెడ్డి సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ జీవోలు, ఆర్డీవో, తహసీల్దార్ల సమక్షంలో నిబంధనల ప్రకారం అన్ని సర్వేలు పూర్తయ్యాకే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను నమ్ముకుని, తలదాచుకోవడానికి గూడు నిర్మించుకోవాలనే ఆశతో రూ. 2 నుంచి 3 లక్షల వరకు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్న జర్నలిస్టులను నేడు అన్యాయంగా కోర్టు కేసుల పేరుతో నట్టేట ముంచడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.​ఎన్నికల ముందు 'ప్రజాపాలన' అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే నియంతృత్వ పోకడలతో జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు సిద్ధపడటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు.రాజకీయ పార్టీల మధ్య ఉండే కక్షలు, నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కలం కార్మికుల హక్కులను బలిచేయాలని చూస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవలం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే బాధ్యత తీరిపోదని, జర్నలిస్టుల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బాధ్యతాయుతంగా అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.​ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు రోడ్డున పడి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం, నాయకులు మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం తగదని వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తక్షణమే చొరవ చూపి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వేజ్ బోర్డు సిఫార్సులు, కనీస వేతన చట్టాలను అమలు చేసి జర్నలిస్టుల ఆర్థిక భద్రతను కాపాడాలని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే సీపీఎం శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణతో రోడ్డెక్కి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య,సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి…

-​హుజూరాబాద్‌లో 4వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు…

-​ఇళ్ల స్థలాల వివాదాన్ని పరిష్కరించకుంటే ప్రత్యక్ష పోరాటం తప్పదు…

-​మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని డిమాండ్..

హుజూరాబాద్/ ఆగస్టు 19 (మా అక్షరం):
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల పొట్టకొట్టేలా అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, కలం కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హుజూరాబాద్ పట్టణంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో కేసు వేసి వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని వాసుదేవరెడ్డి సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ జీవోలు, ఆర్డీవో, తహసీల్దార్ల సమక్షంలో నిబంధనల ప్రకారం అన్ని సర్వేలు పూర్తయ్యాకే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను నమ్ముకుని, తలదాచుకోవడానికి గూడు నిర్మించుకోవాలనే ఆశతో రూ. 2 నుంచి 3 లక్షల వరకు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్న జర్నలిస్టులను నేడు అన్యాయంగా కోర్టు కేసుల పేరుతో నట్టేట ముంచడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.​ఎన్నికల ముందు ‘ప్రజాపాలన’ అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే నియంతృత్వ పోకడలతో జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు సిద్ధపడటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు.రాజకీయ పార్టీల మధ్య ఉండే కక్షలు, నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కలం కార్మికుల హక్కులను బలిచేయాలని చూస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవలం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే బాధ్యత తీరిపోదని, జర్నలిస్టుల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బాధ్యతాయుతంగా అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.​ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు రోడ్డున పడి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం, నాయకులు మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం తగదని వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తక్షణమే చొరవ చూపి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వేజ్ బోర్డు సిఫార్సులు, కనీస వేతన చట్టాలను అమలు చేసి జర్నలిస్టుల ఆర్థిక భద్రతను కాపాడాలని కోరారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే సీపీఎం శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణతో రోడ్డెక్కి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది ముక్కెర రాజు, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య,సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !