+91 99635 77856

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు

హుజూరాబాద్/ ఆగస్టు 19 (మా అక్షరం): పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ వద్ద ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల ప్రసాద్ జెండాను ఆవిష్కరించారు.అనంతరం  అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బండ శ్రీనివాస్‌తో కలిసి అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సమాజంలో ఫోటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫోటోగ్రఫీ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. కాలంతో చెరిగిపోని జ్ఞాపకాలను పదిలపరచడంతో పాటు సమాజంలోని వాస్తవాలను ప్రపంచానికి చూపించే శక్తి ఒక్క క్లిక్‌కు ఉందని అన్నారు.ఫోటోగ్రఫీ రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్ ఫోటోగ్రాఫర్ ఐత రాజేందర్‌తో పాటు కార్యక్రమానికి హాజరైన అతిథులను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి గౌడ్, ఉపాధ్యక్షుడు యాకుబ్ అలీ, ఎడ్ల కుమారస్వామి, కోశాధికారి మధుకర్, జిల్లా నాయకులు బింగి మురళి, భాషబోయిన రాజేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాయిత రాములు, కామనీ రవీందర్, ఫోటోగ్రాఫర్లు మాడ రవీందర్ రెడ్డి, వోడపల్లి రాజు, రాజేష్, రాజేంద్రప్రసాద్, చక్రపాణి, నరేందర్, బండి రమేష్, బిక్షపతి, అశోక్, సుధాకర్, మోహన్, సృజన్ కుమార్, సొల్లు యాదగిరితో పాటు యూనియన్ బాధ్యులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !