హుజురాబాద్ ఆగస్టు 18 (మా అక్షరం):సర్వాయి పాపన్న ఆశయ సాధనకై కృషి చేయాలని హుజురాబాద్ గౌడ సంఘం ప్రెసిడెంట్ శ్రీపతి కుమార్ అన్నారు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని మంగళవారం సర్దార్ జయంతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రెసిడెంట్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని కొనియాడారు.సామాన్య ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సామాజిక సమానత్వం కోసం చూపిన అంకితభావం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.అణగారిన వర్గాల కోసం నిలబడి, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సర్వాయి పాపన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేయడం మాత్రమే కాకుండా, ప్రతి సంవత్సరం జయంతి వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం సమాజానికి గర్వకారణమన్నారు.సమాజంలో ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సర్వాయి పాపన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలనిపిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యాయవాదులు ముక్కెర రాజు, కొత్తూరు రమేష్, కౌన్సిలర్లు వర్ధిని రవీందర్రావు, పంజాల మనోజ్ గౌడ్,గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.













