+91 99635 77856

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి..

Kudikala Sai Editor
maaksharamnews.in

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి..

-​కలం పోరుబాట పడితే పాలకుల పీఠాలు కదలడం ఖాయం...

-​స్వామిరెడ్డిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కుట్రలు..

-బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ధ్వజం..

-​హుజూరాబాద్‌లో 6వ రోజుకు చేరిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు...

-బీజేపీ సంపూర్ణ మద్దతు...

హుజూరాబాద్/ ఆగస్టు 21 (మా అక్షరం): సమాజ హితం కోసం, ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తే జర్నలిస్టుల న్యాయమైన హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, కలం యోధులు తిరగబడితే గతంలో ఎందరో పాలకుల సింహాసనాలు కుప్పకూలిన చరిత్ర ఉందని బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గత ప్రభుత్వం అర్హులైన 52 మంది జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను ప్రస్తుత పాలకులు అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బేషరతుగా, తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.​హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
​అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
దీక్షా శిబిరంలో తూర్పాటి రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు జర్నలిస్టుల పోరాటానికి దన్నుగా నిలుస్తుంటే, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం గూడూరు స్వామిరెడ్డిని పావుగా వాడుకుని జర్నలిస్టులను రోడ్డున పడేసేలా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుచేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు తలచుకుంటే ముఖ్యమంత్రుల పీఠాలే కదిలిపోయాయని, అలాంటిది స్వామిరెడ్డి వంటి వ్యక్తులు ఓ లెక్కే కాదని ఘాటుగా హెచ్చరించారు. కలం పట్టే చేతులే అవసరమైతే ప్రజా పోరాటాల ఆయుధాలుగా మారుతాయని స్పష్టం చేశారు.

​కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి సమస్య..

హుజూరాబాద్ చైతన్యవంతమైన గడ్డ అని, జర్నలిస్టుల ఉద్యమం ప్రస్తుతం శాంతియుతంగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.ఈ వ్యవహారాన్ని త్వరలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, వారిని దీక్షా శిబిరానికి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీజేపీ శ్రేణులు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో బీజేపీ హుజూరాబాద్ పట్టణ నాయకులు పోతుల సంజీవ్, గంగిశెట్టి రాజు, రావుల వేణు, తిప్పబత్తిని రాజు, గంగిశెట్టి ప్రభాకర్, సంజీవరెడ్డి, వెంకన్న, గంట సంపత్, కొలిపాక శ్రీనివాస్, ఎర్ర శ్రావణ్, ఇల్లందుల ప్రణీత్, ఉడ్నాల విజయ్, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్యతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన చైతన్య గీతాలు ఆలోచింపజేశాయి.

Share ePaper Clip

Preparing image...

-​కలం పోరుబాట పడితే పాలకుల పీఠాలు కదలడం ఖాయం…

-​స్వామిరెడ్డిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కుట్రలు..

-బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ధ్వజం..

-​హుజూరాబాద్‌లో 6వ రోజుకు చేరిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు…

-బీజేపీ సంపూర్ణ మద్దతు…

హుజూరాబాద్/ ఆగస్టు 21 (మా అక్షరం): సమాజ హితం కోసం, ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తే జర్నలిస్టుల న్యాయమైన హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, కలం యోధులు తిరగబడితే గతంలో ఎందరో పాలకుల సింహాసనాలు కుప్పకూలిన చరిత్ర ఉందని బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గత ప్రభుత్వం అర్హులైన 52 మంది జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను ప్రస్తుత పాలకులు అడ్డుకోవాలని చూడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బేషరతుగా, తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.​హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
​అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
దీక్షా శిబిరంలో తూర్పాటి రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు జర్నలిస్టుల పోరాటానికి దన్నుగా నిలుస్తుంటే, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం గూడూరు స్వామిరెడ్డిని పావుగా వాడుకుని జర్నలిస్టులను రోడ్డున పడేసేలా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుచేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు తలచుకుంటే ముఖ్యమంత్రుల పీఠాలే కదిలిపోయాయని, అలాంటిది స్వామిరెడ్డి వంటి వ్యక్తులు ఓ లెక్కే కాదని ఘాటుగా హెచ్చరించారు. కలం పట్టే చేతులే అవసరమైతే ప్రజా పోరాటాల ఆయుధాలుగా మారుతాయని స్పష్టం చేశారు.

​కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి సమస్య..

హుజూరాబాద్ చైతన్యవంతమైన గడ్డ అని, జర్నలిస్టుల ఉద్యమం ప్రస్తుతం శాంతియుతంగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.ఈ వ్యవహారాన్ని త్వరలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి, వారిని దీక్షా శిబిరానికి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీజేపీ శ్రేణులు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో బీజేపీ హుజూరాబాద్ పట్టణ నాయకులు పోతుల సంజీవ్, గంగిశెట్టి రాజు, రావుల వేణు, తిప్పబత్తిని రాజు, గంగిశెట్టి ప్రభాకర్, సంజీవరెడ్డి, వెంకన్న, గంట సంపత్, కొలిపాక శ్రీనివాస్, ఎర్ర శ్రావణ్, ఇల్లందుల ప్రణీత్, ఉడ్నాల విజయ్, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్యతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన చైతన్య గీతాలు ఆలోచింపజేశాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !