+91 99635 77856

ఘనంగా టైగర్ ఆలే నరేంద్ర 80వ జయంతి వేడుకలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా టైగర్ ఆలే నరేంద్ర 80వ జయంతి వేడుకలు

హుజూరాబాద్/ ఆగస్టు 21 (మా అక్షరం): పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆవరణలో హుజూరాబాద్ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత టైగర్ ఆలే నరేంద్ర 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ.. టైగర్ ఆలే నరేంద్ర తన జీవితమంతా పేద ప్రజలకు అండగా నిలిచి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు.తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఆలే నరేంద్ర సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, వేముల యాదగిరి, సబ్బని రాజేందర్, మంచికట్ల కమలాకర్, చేనేత జిల్లా సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రామచంద్రము, మంద భిక్షపతి, ముషం వెంకటేశ్వర్లు, పాత్రికేయులు తాటిపాముల దేవేందర్, పోతరాజు సంపత్, సంగెం శ్రీనివాస్ (చిక్స్), సంగెం శ్రీనివాస్ (మెడికల్), కుడికాల ప్రభాకర్‌తో పాటు అధిక సంఖ్యలో పద్మశాలి కులబాంధవులు, నేత కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.

.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !