– నియామక పత్రం అందజేసిన వొడితల ప్రణవ్…
హుజూరాబాద్/సెప్టెంబర్ 05(మా అక్షరం): కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా జూపాక గ్రామానికి చెందిన ఇల్లందుల శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ శనివారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి నూతన నాయకత్వం కృషి చేయాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు కొలుగూరి కిరణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి మహేశ్, మాజీ ఎంపీటీసీ కేతిరి రాజిరెడ్డి, సమ్మక్క–సారలమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్ దాసరి సదయ్య, మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు తాళ్లపల్లి కుమార్, ఇల్లందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













