+91 99635 77856

తుమ్మనపల్లిలో ఘనంగా శ్రీకృష్ణుడి ఊరేగింపు

Kudikala Sai Editor
maaksharamnews.in

తుమ్మనపల్లిలో ఘనంగా శ్రీకృష్ణుడి ఊరేగింపు

/ సెప్టెంబర్ 06(మా అక్షరం): మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో త్రైత సిద్ధాంతం–ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మాష్టమి సందర్భంగా గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై శ్రీకృష్ణుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుని హుజూరాబాద్‌ ఎస్‌ఐ, ఎంఈఓ ఊరేగింపును ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని శ్రీకృష్ణుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.శ్రీకృష్ణుడి తత్వం, భగవద్గీత సందేశాన్ని ప్రజలకు తెలియజేయడమే ఊరేగింపు ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, శ్రీధర్‌, వేణు, పృథ్వీరెడ్డి, పురుషోత్తంరెడ్డి, రాజయ్య, నక్షత్రరెడ్డి, ఉమాదేవి, దివ్య, లీలారాణి, ఉషారాణి, ఆరాధ్య, హాని తదితరులు, సమితి సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !