+91 99635 77856

కందుగులలో బీఆర్‌ఎస్‌ ఆటో ర్యాలీ

Kudikala Sai Editor
maaksharamnews.in

కందుగులలో బీఆర్‌ఎస్‌ ఆటో ర్యాలీ

-కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన...

హుజూరాబాద్‌/సెప్టెంబర్‌ 06 (మా అక్షరం): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని కందుగుల గ్రామంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలి...

ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్‌ మండ సతీష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్నారు.

పంచాయతీలకు నిధులు కేటాయించాలి...

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులు కేటాయించి పాలనను గాడిలో పెట్టాలని సతీష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బెల్లి రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బెల్లి రవి, మాజీ ఎంపీటీసీ కాసం పద్మ రఘుపతిరెడ్డి, వార్డు సభ్యులు గోలి అరణ్య విజయ్‌కుమార్‌, మండ కవిత శ్రీనివాస్‌, తలకొక్కుల భిక్షపతి, ఎలగందుల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన…

హుజూరాబాద్‌/సెప్టెంబర్‌ 06 (మా అక్షరం): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని కందుగుల గ్రామంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వాలి…

ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్‌ మండ సతీష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్నారు.

పంచాయతీలకు నిధులు కేటాయించాలి…

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులు కేటాయించి పాలనను గాడిలో పెట్టాలని సతీష్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బెల్లి రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు బెల్లి రవి, మాజీ ఎంపీటీసీ కాసం పద్మ రఘుపతిరెడ్డి, వార్డు సభ్యులు గోలి అరణ్య విజయ్‌కుమార్‌, మండ కవిత శ్రీనివాస్‌, తలకొక్కుల భిక్షపతి, ఎలగందుల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !