+91 99635 77856

కాకతీయ కాలువకు చెట్ల ముప్పు

Kudikala Sai Editor
maaksharamnews.in

కాకతీయ కాలువకు చెట్ల ముప్పు

-తొలగించి కాలువను కాపాడాలి: కౌన్సిలర్‌ వర్ధినేని రవీందర్‌రావు...

హుజూరాబాద్‌/ సెప్టెంబరు 07 (మా అక్షరం): మార్కెట్‌ కమిటీకి సమీపంలోని కాకతీయ కాలువలో చెట్లు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి కాలువ ఆనవాళ్లు కనిపించకుండా పోతున్నాయి. సోమవారం ఈ ప్రాంతాన్ని హుజూరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ వర్ధినేని రవీందర్‌రావు పరిశీలించారు.కాలువలో చెట్లు పెద్దఎత్తున పెరగడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో పాటు కాలువ గట్లు, నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని రవీందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలో పెరిగిన చెట్ల వేర్లు విస్తరించడం వల్ల కాలువ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉందన్నారు.కాకతీయ కాలువ హుజూరాబాద్‌ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యమైందని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువలో పెరిగిన చెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి కాలువను పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాలువ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

-తొలగించి కాలువను కాపాడాలి: కౌన్సిలర్‌ వర్ధినేని రవీందర్‌రావు…

హుజూరాబాద్‌/ సెప్టెంబరు 07 (మా అక్షరం): మార్కెట్‌ కమిటీకి సమీపంలోని కాకతీయ కాలువలో చెట్లు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి కాలువ ఆనవాళ్లు కనిపించకుండా పోతున్నాయి. సోమవారం ఈ ప్రాంతాన్ని హుజూరాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ వర్ధినేని రవీందర్‌రావు పరిశీలించారు.కాలువలో చెట్లు పెద్దఎత్తున పెరగడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో పాటు కాలువ గట్లు, నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని రవీందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలో పెరిగిన చెట్ల వేర్లు విస్తరించడం వల్ల కాలువ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉందన్నారు.కాకతీయ కాలువ హుజూరాబాద్‌ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యమైందని, అధికారులు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువలో పెరిగిన చెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి కాలువను పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాలువ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !