-రక్తదానం మరొకరికి ప్రాణదానం: చైర్‌పర్సన్ సుహాసిని రొంటాల…
హుజూరాబాద్/ సెప్టెంబరు 07 (మా అక్షరం): రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని రొంటాల అన్నారు. పట్టణంలోని హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శ్రీనిధి వాలంటరీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా సుహాసిని రొంటాల మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సంతోషకరమని తెలిపారు. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మనం ఇచ్చే రక్తం అవసరంలో ఉన్న మరో వ్యక్తికి ప్రాణాధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.రక్తదానం చేసిన వారిని ఈ సందర్భంగా నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సొల్లు సునీత, కోయల్కర్ భారతి, ట్రస్టు చైర్మన్ పృద్వి, దయాకర్, డేవిడ్‌రాజ్, నెల్సన్, డెనియల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.













