+91 99635 77856

ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి

-హుజూరాబాద్ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఇబ్బందులు – కనీసం రెండు తడులతో చెరువులు నింపాలి...

హుజూరాబాద్/ సెప్టెంబర్10 (మా అక్షరం): లోయర్ మానేరు డ్యామ్‌ (ఎల్ఎండీ)లో సుమారు 10 టీఎంసీల నీటి నిల్వ ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం తాగునీరు, సాగునీటికి రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలువకు కనీసం రెండు తడుల నీటిని విడుదల చేస్తే నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను నింపుకునే అవకాశం ఉంటుందన్నారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య కొంతమేర తగ్గుతుందని పేర్కొన్నారు. ఎల్ఎండీలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు జాప్యం చేయడం సరికాదన్నారు.రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

-హుజూరాబాద్ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఇబ్బందులు – కనీసం రెండు తడులతో చెరువులు నింపాలి…

హుజూరాబాద్/ సెప్టెంబర్10 (మా అక్షరం): లోయర్ మానేరు డ్యామ్‌ (ఎల్ఎండీ)లో సుమారు 10 టీఎంసీల నీటి నిల్వ ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడవెల్లి కొండల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం తాగునీరు, సాగునీటికి రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలువకు కనీసం రెండు తడుల నీటిని విడుదల చేస్తే నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను నింపుకునే అవకాశం ఉంటుందన్నారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య కొంతమేర తగ్గుతుందని పేర్కొన్నారు. ఎల్ఎండీలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు జాప్యం చేయడం సరికాదన్నారు.రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !