+91 99635 77856

పేద విద్యార్థికి అండగా నిలిచిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

Kudikala Sai Editor
maaksharamnews.in

పేద విద్యార్థికి అండగా నిలిచిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

హుజూరాబాద్/ సెప్టెంబర్ 17 (మా అక్షరం): ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు పేద విద్యార్థికి ఆర్థిక చేయూత అందించారు.హుస్నాబాద్‌కు చెందిన కొమ్ముల లక్కీ కమల్ పేద కుటుంబానికి చెందినప్పటికీ చదువులో ప్రతిభ కనబరిచాడు.పదో తరగతిలో 9.7 జీపీఏ, ఇంటర్మీడియట్‌లో 970/1000 మార్కులు సాధించాడు.అలాగే NEET-UG 2026లో 499/720 మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 91,372,ఎస్సీ కేటగిరీలో 3,730వ ర్యాంక్ సాధించాడు.దీంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS చదివే అవకాశం లభించింది.అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వైద్య విద్యను కొనసాగించడం విద్యార్థికి కష్టంగా మారింది. దీంతో తన పరిస్థితిని MASS (మాస్) సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు స్పందించి, MASS సంస్థ ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని, ఒక విద్యార్థి భవిష్యత్తుకు చేయూతనివ్వడం సమాజం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వైద్య విద్యను అభ్యసించేందుకు అందించిన ఆర్థిక సహాయానికి విద్యార్థి కొమ్ముల లక్కీ కమల్‌తో పాటు కుటుంబ సభ్యులు రొంటాల సుహాసిని మనోజ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

హుజూరాబాద్/ సెప్టెంబర్ 17 (మా అక్షరం): ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు పేద విద్యార్థికి ఆర్థిక చేయూత అందించారు.హుస్నాబాద్‌కు చెందిన కొమ్ముల లక్కీ కమల్ పేద కుటుంబానికి చెందినప్పటికీ చదువులో ప్రతిభ కనబరిచాడు.పదో తరగతిలో 9.7 జీపీఏ, ఇంటర్మీడియట్‌లో 970/1000 మార్కులు సాధించాడు.అలాగే NEET-UG 2026లో 499/720 మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 91,372,ఎస్సీ కేటగిరీలో 3,730వ ర్యాంక్ సాధించాడు.దీంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS చదివే అవకాశం లభించింది.అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వైద్య విద్యను కొనసాగించడం విద్యార్థికి కష్టంగా మారింది. దీంతో తన పరిస్థితిని MASS (మాస్) సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు స్పందించి, MASS సంస్థ ద్వారా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదని, ఒక విద్యార్థి భవిష్యత్తుకు చేయూతనివ్వడం సమాజం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వైద్య విద్యను అభ్యసించేందుకు అందించిన ఆర్థిక సహాయానికి విద్యార్థి కొమ్ముల లక్కీ కమల్‌తో పాటు కుటుంబ సభ్యులు రొంటాల సుహాసిని మనోజ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !