+91 99635 77856

కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యం.. 

Kudikala Sai Editor
maaksharamnews.in

కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యం.. 

-రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటా:వర్ధినేని రవీందర్ రావు...

హుజురాబాద్/ సెప్టెంబర్ 20(మా అక్షరం) కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, హుజురాబాద్ 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ క్లబ్‌లో నిర్వహించిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.రిటైర్డ్ ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ తమ హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు.ఉద్యోగ విరమణ అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని రాజయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్, బకాయిలు, ఈపీఎఫ్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 1995కు ముందు పదవీ విరమణ చేసిన కార్మికులు, 1995 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ అంశాలను వివరించారు. 1995 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచిన విషయాన్ని సమావేశంలో వివరించారు.ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చెల్లించే అవకాశం ఉందని ఎండీ తెలిపినట్లు బత్తిని రాజయ్య పేర్కొన్నారు. అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విషయంలోనూ త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మార్త రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి పేరాల లక్ష్మణరావు, ట్రెజరర్ ఏబీ రెడ్డి, ముఖ్య సలహాదారు ఎంఆర్ మొగిలి, కమిటీ సభ్యులు పీఎస్ రెడ్డి, బీఆర్ మౌళి, కేపీ రెడ్డి, గోలి ఉపేందర్, వీడీ రెడ్డి, బత్తిని సంజీవ, కంకల కొమురయ్య, బి.మొగిలి తదితర రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటా:వర్ధినేని రవీందర్ రావు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !