+91 99635 77856

దేవుడిని అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

Kudikala Sai Editor
maaksharamnews.in

దేవుడిని అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

-కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్‌ – నిమజ్జన ఏర్పాట్లపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు...

హుజురాబాద్ /సెప్టెంబర్ 25 (మా అక్షరం):వినాయక నిమజ్జనం సందర్భంగా హుజురాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భక్తి కార్యక్రమాలను రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని, దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఇదే విధంగా జరిగాయని, ఇప్పుడు జరిగిన నిమజ్జనంపై మాట్లాడే ముందు గతంలో జరిగిన విషయాలను కౌశిక్ రెడ్డి గుర్తు చేసుకోవాలని అన్నారు.నీరు లేకపోయినా ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలోని పాలకవర్గం గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

నియోజకవర్గానికి వచ్చావా?...

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఊరేగడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. చందాలు అడుగుతారనే భయంతో నియోజకవర్గానికి రాకుండా తప్పించుకున్న ఆయన.. ఇప్పుడు నిమజ్జనం విషయంలో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.“నియోజకవర్గంలో ఒక్క వినాయకుడినైనా దర్శించుకున్నావా? ఎందుకు నీ కడుపు రగులుతోంది?” అంటూ ప్రశ్నించారు.భక్తి కార్యక్రమాలను అడ్డుపెట్టుకుని ఓట్ల రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ప్రజల విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.

ప్రణవ్ పనులు.. కౌశిక్ ఖాతాలోనా?...

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ చేపట్టిన పనులను తానే చేసినట్లు కౌశిక్ రెడ్డి చెప్పుకుంటూ తిరుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, చిల్లర మాటలతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ఎథిక్స్ కమిటీ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.“దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలి. భక్తి కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చొద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారు”అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు సదానందం, మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, మొలుగు రాధ, మైనారిటీ నాయకుడు ఇమ్రాన్, సేవాదళ్ అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్‌ – నిమజ్జన ఏర్పాట్లపై ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు…

హుజురాబాద్ /సెప్టెంబర్ 25 (మా అక్షరం):వినాయక నిమజ్జనం సందర్భంగా హుజురాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భక్తి కార్యక్రమాలను రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని, దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఇదే విధంగా జరిగాయని, ఇప్పుడు జరిగిన నిమజ్జనంపై మాట్లాడే ముందు గతంలో జరిగిన విషయాలను కౌశిక్ రెడ్డి గుర్తు చేసుకోవాలని అన్నారు.నీరు లేకపోయినా ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆధ్వర్యంలోని పాలకవర్గం గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

నియోజకవర్గానికి వచ్చావా?…

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఊరేగడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. చందాలు అడుగుతారనే భయంతో నియోజకవర్గానికి రాకుండా తప్పించుకున్న ఆయన.. ఇప్పుడు నిమజ్జనం విషయంలో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.“నియోజకవర్గంలో ఒక్క వినాయకుడినైనా దర్శించుకున్నావా? ఎందుకు నీ కడుపు రగులుతోంది?” అంటూ ప్రశ్నించారు.భక్తి కార్యక్రమాలను అడ్డుపెట్టుకుని ఓట్ల రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ప్రజల విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.

ప్రణవ్ పనులు.. కౌశిక్ ఖాతాలోనా?…

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ చేపట్టిన పనులను తానే చేసినట్లు కౌశిక్ రెడ్డి చెప్పుకుంటూ తిరుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, చిల్లర మాటలతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు. ఎథిక్స్ కమిటీ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.“దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలి. భక్తి కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చొద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను హుజురాబాద్ ప్రజలు గమనిస్తున్నారు”అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, పట్టణ అధ్యక్షుడు తిరుపతి, జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు సదానందం, మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, మొలుగు రాధ, మైనారిటీ నాయకుడు ఇమ్రాన్, సేవాదళ్ అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !