+91 99635 77856

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా నిమ్మటూరి సాయికృష్ణ

Kudikala Sai Editor
maaksharamnews.in

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా నిమ్మటూరి సాయికృష్ణ

-తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నియామకం...

హుజురాబాద్ /సెప్టెంబర్ 25 (మా అక్షరం):వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు నిమ్మటూరి సాయికృష్ణ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన అధికారిక ఉత్సవ కమిటీలో ప్రభుత్వం మొత్తం 30 మంది కన్వీనర్లకు అవకాశం కల్పించగా, అందులో నిమ్మటూరి సాయికృష్ణకు స్థానం కల్పించింది. ఈ నియామకం పట్ల హుజురాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖులు, స్థానికులు, రజక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిమ్మటూరి సాయికృష్ణ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సాయికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.నిమ్మటూరి సాయికృష్ణ నియామకం పట్ల హుజురాబాద్ రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొండపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, సీనియర్ రజక సంఘం నాయకులు కొలిపాక సారయ్య, కొలిపాక పోచయ్య, కొలిపాక శంకర్, బోరింగ్ వెంకటరజం, గోపు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, బీజేపీ శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

-తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నియామకం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !