+91 99635 77856

నేతన్న భరోసా నగదు పెంచాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

నేతన్న భరోసా నగదు పెంచాలి

-చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి...

హుజురాబాద్ /సెప్టెంబర్ 26(మా అక్షరం): చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం 73వ వార్షిక మహాసభ శనివారం సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలు, సంఘ అభివృద్ధిపై చర్చించారు.నేతన్న భరోసా పథకం నగదును పెంచాలని, నేతన్న భద్రత పథకాన్ని కొనసాగించాలని, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఎల్‌ఐసీ పథకాలను అమలు చేయాలని కోరారు. సాధారణ నేతకూలీలు, అద్దకం చార్జీలు పెంచాలని, చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు, అంత్యోదయ కార్డులు, హెల్త్‌ కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.చేనేతలో నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించాలని, సంఘానికి అవసరమైన ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో సంఘ వార్షిక నివేదిక, ఆడిట్ బ్యాలెన్స్‌షీట్, 2026-27 బడ్జెట్ ఆమోదించడంతో పాటు సభ్యులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు జి. రాఘవరావు, అభివృద్ధి అధికారి యం.ఏ. హజార్ వహబ్, సంఘ పాలకవర్గ సభ్యులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !