-వెట్టి చాకిరీ, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వీరనారి పోరాటం…
హుజురాబాద్ /సెప్టెంబర్ 26(మా అక్షరం): తెలంగాణ మహిళా స్ఫూర్తిదాయిని,పేదల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్ నిమ్మటూరి సాయికృష్ణ అన్నారు. హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సమీపంలోని ఐలమ్మ విగ్రహం వద్ద శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వెట్టి చాకిరీ, పెత్తందారీ దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు.భూమి, కూలి,ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాలను చైతన్యపరిచిన ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.మహిళలు కూడా అన్యాయాన్ని ప్రశ్నించి హక్కుల కోసం పోరాడగలరని ఐలమ్మ తన జీవితంతో చాటిచెప్పారని తెలిపారు.ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి పరిచయం చేస్తూ,సామాజిక సమానత్వం,మహిళల ఆత్మగౌరవం, పేదల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.కిషన్, మేనేజర్ భూపాల్రెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీలు, రజక సంఘం, ప్రజా సంఘాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













