-రూ.4.35 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి…
హుజురాబాద్/ సెప్టెంబర్ 28( మా అక్షరం):అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.పట్టణంలోని పలు వార్డుల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.4.35 లక్షల విలువైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం, వైద్య ఖర్చులు ఆర్థిక భారంగా మారుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన అర్హులైన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వైద్య ఖర్చులకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్ గందె శ్రీనివాస్, బండ నరేష్, నరసింహ రెడ్డి -లావణ్య, వర్దినేని రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్లు కోలిపాక శ్రీనివాస్, ఇమ్రాన్, రమేష్, శాంతన్రెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాస్, ముత్యం రాజు, తిరుమల్‌రెడ్డి, రమాదేవితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.













