+91 99635 77856

మంచంపై చిన్నారి.. ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

Kudikala Sai Editor
maaksharamnews.in

మంచంపై చిన్నారి.. ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

-సహాయం కోసం ఫోన్‌పే / గూగుల్‌పే: 99499 46640....

-కాలేయ వ్యాధితో మూడేళ్ల చిన్నారి దేవాన్షి విలవిల...

హుజురాబాద్/ సెప్టెంబర్ 29 (మా అక్షరం):పలకా బలపం పట్టుకుని బడిబాట పట్టాల్సిన వయసు.. ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల ఒడిలో ఆనందంగా గడపాల్సిన చిన్నారి. కానీ అనారోగ్యం ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టింది. మూడేళ్ల చిన్నారి దేవాన్షి ప్రస్తుతం ఆస్పత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతున్నాడు. కాలేయ వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో అత్యవసరంగా కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు దాతల కోసం కన్నీటితో ఎదురుచూస్తున్నారు.హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన జడల సుధాకర్–మౌనిక దంపతుల కుమారుడు దేవాన్షి (3). రెండు నెలల క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో పుట్టుకతోనే కాలేయ సంబంధిత తీవ్రమైన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నప్పటికీ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పరిస్థితి విషమించింది.ఇప్పటికే చిన్నారి చికిత్స కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులు పరీక్షించి, చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే అత్యవసరంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.

“మా బిడ్డను కాపాడండి.. మీ సాయం మాకు ప్రాణదానం”

ఇప్పటికే అప్పులు చేసి బిడ్డకు చికిత్స చేయించిన తమకు మరో రూ.30 లక్షలు సమకూర్చడం సాధ్యం కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆస్పత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతుండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.“మా బిడ్డను కాపాడేందుకు దాతలు ముందుకు రావాలి. మీకు తోచినంత సాయం చేసినా మా దేవాన్షి ప్రాణాలను కాపాడుకునేందుకు అది ఎంతో ఉపయోగపడుతుంది” అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.దాతలు, దాతృత్వ సంస్థలు, సేవా సంస్థలు స్పందించి చిన్నారి దేవాన్షి చికిత్సకు తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీరు అందించే చిన్న సహాయం కూడా ఒక చిన్నారి ప్రాణానికి పెద్ద ఆశగా మారవచ్చు.

📞 సహాయం కోసం ఫోన్‌పే / గూగుల్‌పే:

99499 46640

Share ePaper Clip

Preparing image...

-సహాయం కోసం ఫోన్‌పే / గూగుల్‌పే: 99499 46640….

-కాలేయ వ్యాధితో మూడేళ్ల చిన్నారి దేవాన్షి విలవిల…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !