+91 99635 77856

బీసీ రక్షణ చట్టం తేవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

బీసీ రక్షణ చట్టం తేవాలి

-బీసీ జేఏసీ నాయకుల డిమాండ్...

హుజురాబాద్/ అక్టోబర్ 01(మా అక్షరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న డిమాండ్ చేశారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు గురువారం పట్టణంలోని స్థానిక హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన తరహాలో తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లోనూ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, ఉపాధ్యక్షులు కొలిపాక క్రాంతికుమార్, మామునూరి ప్రవీణ్‌కుమార్, తాళ్లపల్లి రమేష్, మంచికట్ల మురళి, చిలుకమారి శ్రీనివాస్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని, మంద బిక్షపతి, కానుగంటి శ్రీనివాస్, గోస్కుల మధుకర్, గరవేణ శ్రీకాంత్, కన్నెబోయిన రాజయ్య, దాసరి మల్లేశం, పిల్లి రాజు, రావుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బీసీ జేఏసీ నాయకుల డిమాండ్…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !