-బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు డిమాండ్..
హుజురాబాద్/ అక్టోబర్ 11 (మా అక్షరం):కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగితే అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు డిమాండ్ చేశారు. ఆదివారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఓటు చోరీ జరిగిందంటూ వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా సరైనది కాదని విమర్శించారు.ఓటు చోరీ నిజంగా జరిగితే, కాంగ్రెస్ పార్టీ గెలిచిన మూడు రాష్ట్రాలతో పాటు దాని మిత్రపక్షాలు గెలుపొందిన మరో మూడు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఆయన హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు పారేపల్లి కొండల్ రెడ్డి,కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్,పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు తిప్పబత్తిని రాజు, గంట సంపత్, సీనియర్ నాయకులు అంకటి వాసు, రావుల పూర్ణం చందర్,పోచంపల్లి సహదేవ్, పెరుమల్ల దేవ గౌడ,పెరుమళ్ళ కోటి తదితరులు పాల్గొన్నారు













