+91 99635 77856

పేదల పాలిట పెన్నిధి.. పండుగ సాయన్న!

Kudikala Sai Editor
maaksharamnews.in

పేదల పాలిట పెన్నిధి.. పండుగ సాయన్న!

-హుజురాబాద్‌లో ఘనంగా 174వ జయంతి వేడుకలు...

-ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తాం: ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య...

హుజురాబాద్/అక్టోబర్ 22 (మా అక్షరం): తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, పేదల పాలిట అండగా నిలిచిన పోరాట యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు బహుజన నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నది ప్రత్యేక స్థానమని పేర్కొన్నారు. 1840 నుంచి 1900 మధ్యకాలంలో నిజాం పాలనలో అణచివేతకు గురైన బహుజన, పేద ప్రజలకు అండగా నిలిచి, అక్రమంగా సంపద కూడబెట్టిన సంపన్నుల నుంచి దోచుకున్న సంపదను పేదలకు పంచి వారి ఆకలి తీర్చిన మహా యోధుడిగా పండుగ సాయన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. అందుకే ఆయనను తెలంగాణ రాబిన్‌హుడ్‌గా, బహుజన విప్లవ వీరుడిగా ప్రజలు గుర్తుచేసుకుంటారని అన్నారు.అలాంటి వీరుడి వారసత్వం కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గంలో జన్మించినందుకు తెలంగాణలోని ముదిరాజులంతా గర్వపడాలని పేర్కొన్నారు. పండుగ సాయన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

రానున్న రోజుల్లో పండుగ సాయన్న స్ఫూర్తితో ముదిరాజుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని కొలిపాక సమ్మయ్య స్పష్టం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-డి నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చాలన్న డిమాండ్ సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణలోని ముదిరాజులందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గుడ్డేల్గుల సమ్మయ్య, పోచయ్య, పిల్లి సమ్మయ్య, గోస్కుల వెంకన్న, గుడ్డేల్గుల సారయ్య, రవీందర్ బాబుతో పాటు బహుజన నాయకులు వేల్పుల రత్నం, కొలిపాక శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్, రాం రాజేశ్వర్, తులసి లక్ష్మణమూర్తి, బుర్రి శేఖర్, వేల్పుల ప్రభాకర్, చిలుకమరి శ్రీనివాస్, రఘుచారి తదితరులు పాల్గొన్నారు. వివిధ బీసీ సంఘాల నాయకులు సైతం హాజరై పండుగ సాయన్నకు నివాళులర్పించారు.

Share ePaper Clip

Preparing image...

-హుజురాబాద్‌లో ఘనంగా 174వ జయంతి వేడుకలు…

-ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తాం: ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !