+91 99635 77856

పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి

-ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి...

-పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో సీపీ గౌష్ ఆలం...

హుజూరాబాద్/ అక్టోబర్ 24 (మా అక్షరం):ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులకు సూచించారు. శనివారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించి, స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు.

రికార్డులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష...

వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించిన కమిషనర్.. కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులు, క్షేత్రస్థాయిలో వారి పనితీరుపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకతను పెంపొందిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సీసీ కెమెరాల పనితీరుపై ప్రత్యేక దృష్టి

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న సీపీ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పోలీసు పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, అవసరమైన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కేసులకు సంబంధించిన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రికార్డులను క్రమబద్ధీకరించాలని, ఉపయోగంలో లేని పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెంచాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని, ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి…

-పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో సీపీ గౌష్ ఆలం…

హుజూరాబాద్/ అక్టోబర్ 24 (మా అక్షరం):ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులకు సూచించారు. శనివారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించి, స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు.స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనాన్ని సీపీ స్వీకరించారు.

రికార్డులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష…

వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించిన కమిషనర్.. కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులు, క్షేత్రస్థాయిలో వారి పనితీరుపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకతను పెంపొందిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సీసీ కెమెరాల పనితీరుపై ప్రత్యేక దృష్టి

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న సీపీ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని నిఘా కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. పెట్రోలింగ్ వాహనాలు, ఆధునిక పోలీసు పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, అవసరమైన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కేసులకు సంబంధించిన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రికార్డులను క్రమబద్ధీకరించాలని, ఉపయోగంలో లేని పాత సామగ్రిని కమిషనరేట్‌కు తరలించి పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో నమ్మకం పెంచాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని, ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !