-సబ్‌జైలు ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు…
హుజూరాబాద్/అక్టోబర్ 24 (మా అక్షరం):ఆర్థిక స్థోమత లేని విచారణ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి పి.బి. కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం సబ్‌జైలులో ఖైదీలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయ సేవాధికార సంస్థల చట్టం కింద అర్హులైన ఖైదీలకు అందించే ఉచిత న్యాయవాది సేవలు, బెయిల్ పొందే విధానాలు, లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకునే మార్గాలను వివరించారు. ఖైదీలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం ఖైదీలు అడిగిన పలు న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌జైలు పర్యవేక్షణ అధికారి పి. శ్రీనివాస్,అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ టి. సురేష్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.













