+91 99635 77856

సొంతింట్లో దీపాల పండుగ.. లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు!

Kudikala Sai Editor
maaksharamnews.in

సొంతింట్లో దీపాల పండుగ.. లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు!

- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో పండుగ జరుపుకున్న వొడితల ప్రణవ్...

- ధర్మరాజుపల్లిని గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం...

- నియోజకవర్గంలో ఇప్పటికే 2,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి...

హుజురాబాద్ / నవంబర్ 07 (మా అక్షరం):పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గతంలో ఇళ్లు లేని నిరుపేదలు పూరి గుడిసెల్లో, అద్దె ఇళ్లలో దీపావళి పండుగ జరుపుకునేవారని, నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటిలో దీపాల పండుగ జరుపుకునే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి ప్రణవ్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపాల వెలుగుల మాదిరిగానే ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 2,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ధర్మరాజుపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో పండుగ జరుపుకున్న వొడితల ప్రణవ్…

– ధర్మరాజుపల్లిని గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం…

– నియోజకవర్గంలో ఇప్పటికే 2,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి…

హుజురాబాద్ / నవంబర్ 07 (మా అక్షరం):పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గతంలో ఇళ్లు లేని నిరుపేదలు పూరి గుడిసెల్లో, అద్దె ఇళ్లలో దీపావళి పండుగ జరుపుకునేవారని, నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటిలో దీపాల పండుగ జరుపుకునే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి ప్రణవ్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపాల వెలుగుల మాదిరిగానే ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 2,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ధర్మరాజుపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !