+91 99635 77856

కరీంనగర్ పార్లమెంట్ టీపీసీసీ ఎస్సీ సెల్ ఇన్‌చార్జిగా బత్తుల పరశురాం

Kudikala Sai Editor
maaksharamnews.in

కరీంనగర్ పార్లమెంట్ టీపీసీసీ ఎస్సీ సెల్ ఇన్‌చార్జిగా బత్తుల పరశురాం

- స్టేట్ వైస్ చైర్మన్‌గా నియామకం..

- కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: బత్తుల పరశురాం...

హుజురాబాద్/నవంబర్ 08 (మా అక్షరం):కరీంనగర్ పార్లమెంట్ టీపీసీసీ ఎస్సీ సెల్ ఇన్‌చార్జిగా, రాష్ట్ర వైస్ చైర్మన్‌గా పట్టణానికి చెందిన బత్తుల పరశురాములు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవలో బత్తుల పరశురాం అందిస్తున్న నిరంతర సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు కవ్వంపల్లి పేర్కొన్నారు. నియామక ఉత్తర్వులు అందుకున్న అనంతరం హైదరాబాద్‌లో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన పరశురాం పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు బత్తుల పరశురాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ విభాగాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పరశురాం తెలిపారు. ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కార్యకర్తలకు లేదా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అవసరమైన వారు తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.బత్తుల పరశురాం నియామకం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

– స్టేట్ వైస్ చైర్మన్‌గా నియామకం..

– కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: బత్తుల పరశురాం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !