హుజూరాబాద్ / నవంబర్ 12(మా అక్షరం):విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు హుజూరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎం.డి. అంకుశావలి అనే వ్యక్తి తన పర్స్‌ను పోగొట్టుకున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుళ్లు హెచ్‌జీ శ్రీనివాస్, హెచ్‌జీ సంపత్‌లకు ఆ పర్స్ లభించింది.వెంటనే స్పందించిన వారు పర్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో అందులో ఉన్న వ్యక్తిగత కార్డులు, నగదును పరిశీలించి యజమాని ఎం.డి. అంకుశావలికి సురక్షితంగా తిరిగి అప్పగించారు.విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిజాయితీని చాటుకున్న హెచ్‌జీ శ్రీనివాస్, హెచ్‌జీ సంపత్‌లను పలువురు అభినందిస్తున్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా వ్యవహరించిన వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడుతున్నారు.
Post Views: 209













