హుజురాబాద్/ నవంబర్ 16(మా అక్షరం): పట్టణంలోని ప్రతాప సాయిరెడ్డి గార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అర్హులైన లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, రెవెన్యూ డివిజనల్ అధికారి జలకుమారి నాయక్‌వాడి, మున్సిపల్ కమిషనర్ కిషన్, ఎంపీడీవో సునీత పాల్గొన్నారు.ఈ సందర్భంగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు అర్హులైన వివిధ వర్గాల పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు సభ్యులు,గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు













