+91 99635 77856

సిద్ధిపేట సభకు కదలిరండి : బండారి రమేష్ గౌడ్ పిలుపు ​

Kudikala Sai Editor
maaksharamnews.in

సిద్ధిపేట సభకు కదలిరండి : బండారి రమేష్ గౌడ్ పిలుపు ​

- తిమ్మాపూర్ మండలంలోని 23 గ్రామాల కోసం 12 ప్రత్యేక బస్సుల ఏర్పాటు...

​- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి....

తిమ్మాపూర్/ నవంబర్ 18 (మా అక్షరం ):సిద్ధిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండల ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం 12 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు తెలిపారు. మండలంలోని మొత్తం 23 గ్రామాల నుండి సభకు తరలివెళ్లేందుకు వీలుగా బస్సుల సమన్వయం, ప్రయాణ ఏర్పాట్లను ఇప్పటికే పక్కా ప్రణాళికతో పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.గురువారం సిద్ధిపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా "ఇందిరమ్మ కుటుంబ భరోసా" ఇన్సూరెన్స్ పథకం ప్రారంభంతో పాటు, పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాలు జరగనున్నాయని బండారి రమేష్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో జరుగుతున్న బహిరంగ సభకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Share ePaper Clip

Preparing image...

– తిమ్మాపూర్ మండలంలోని 23 గ్రామాల కోసం 12 ప్రత్యేక బస్సుల ఏర్పాటు…

​– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి….

తిమ్మాపూర్/ నవంబర్ 18 (మా అక్షరం ):సిద్ధిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండల ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం 12 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు తెలిపారు. మండలంలోని మొత్తం 23 గ్రామాల నుండి సభకు తరలివెళ్లేందుకు వీలుగా బస్సుల సమన్వయం, ప్రయాణ ఏర్పాట్లను ఇప్పటికే పక్కా ప్రణాళికతో పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.గురువారం సిద్ధిపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా “ఇందిరమ్మ కుటుంబ భరోసా” ఇన్సూరెన్స్ పథకం ప్రారంభంతో పాటు, పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాలు జరగనున్నాయని బండారి రమేష్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో జరుగుతున్న బహిరంగ సభకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !