+91 99635 77856

ధాన్యం కొనుగోళ్లు వెంటనే వేగవంతం చేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

ధాన్యం కొనుగోళ్లు వెంటనే వేగవంతం చేయాలి

- తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం...

తిమ్మాపూర్/ నవంబర్ 18 (మా అక్షరం): బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.బుధవారం తిమ్మాపూర్ మండల శాఖ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ..మండలంలో వరి కోతలు ప్రారంభమై ఇప్పటికే సగానికి పైగా పూర్తయినప్పటికీ, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కరీంనగర్ రూరల్ మండలంలో పరిశీలించగా చాలా కేంద్రాలు మూతపడి ఉన్నాయని, కేంద్రాలు ప్రారంభించిన చోట కూడా వడ్లను కొనుగోలు చేయడం లేదని తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా రానున్న రెండు మూడు రోజుల్లో తుఫాను, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోళ్లు ఆలస్యమవుతుండటాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగారని ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుని ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.అలాగే, ప్రభుత్వం ఇప్పటివరకు గోదాములకు సంబంధించిన ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వలేదని, కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది కొరతతో పాటు తాగునీరు వంటి కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. అధికారులు తక్షణమే స్పందించి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినుకొండ నాగేశ్వర్ రెడ్డి, సెన్సార్ బోర్డు మెంబర్ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు మావురపు సంపత్ కుమార్ ,రామ్ హనుమాన్ నగర్ సర్పంచ్ పిసికా సౌజన్య, కృష్ణ, కిషోర్, అందే శేఖర్ ,గొట్టిముక్కల తిరుపతిరెడ్డి, గడ్డం అరుణ్, ఎరోజు లక్ష్మణ్, ఓంకార్ యాదవ్, సుద్దాల సతీష్ ,ఎలకపల్లి స్వామి, కందుకూరి ఈశ్వర చారి ,బుడిగ నరేష్ ,పాశం సంపత్ ,తొర్తి సంతోష్ ,వేల్పుల నరేష్, ప్రశాంత్ ,వినయ్, చింతల సంపత్ రెడ్డి, బూరుగు శ్రీనివాసరెడ్డి, కామెర వెంకటేష్, సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

– తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !