– కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులకు గుర్తింపు…
– నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా…
– పది సంవత్సరాల విధ్వంసానికి పది నెలల్లో మార్గం చూపిస్తున్నాం..
– జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా…
– అంబేద్కర్ భవన నిర్మాణానికి నా వంతు కృషిచేస్తా…
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్…
హుజురాబాద్/ నవంబర్03(మా అక్షరం): తెలంగాణ ఉద్యమంలో,తెలంగాణ రావడానికి కృషి చేసిన వ్యక్తి కోదండరాం అని,అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినపార్టీ కాంగ్రెస్ పార్టీ అని,ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఆ పదవికే ఆయన గౌరవాన్ని తీసుకువచ్చారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.పదవీ పొందిన అనంతరం తొలిసారిగా హుజురాబాద్ ప్రాంతానికి విచ్చేయడం సంతోషంగా ఉందని అన్నారు.హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్ జరిగిన పౌర సమాజంతో మాట ముచ్చట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు విధ్వంసం జరిగితే పది నెలల్లో జరిగిన విధ్వంసానికి మార్గం చూపిస్తున్నామని,తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే ఈనాటి మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వారికి సముచిత స్థానాన్ని అందిస్తున్నామని అన్నారు.విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుండే ప్రభుత్వం విద్యావంతులైన ప్రొఫెసర్ హరగోపాల్,సూరేపల్లి సుజాత లాంటి వాళ్ళను విద్యాశాఖ అడ్వైసరీ బోర్డులో నియమించామని,ఆకునూరి మురళీ,పి.ఎల్ విశ్వేశ్వర్ లాంటి వాళ్ళను విద్యా కమిషన్ లో నియమించామని అన్నారు.అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆధునీకరణకు సుమారు రెండున్నర కోట్ల నిధులు కేటాయించామని అన్నారు.భవిష్యత్ లో ఇలాంటి సమావేశాలు జరుగుపుకోవడానికి వీలుగా గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మాణం జరిగిన అంబేద్కర్ భవనానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రిలకు సంబంధించి జమ్మికుంట,హుజురాబాద్ హాస్పిటల్స్ కు చెరొక పదిహేను లక్షలు ఇప్పటికే కేటాయించామని తెలిపారు.వైద్యుల కొరత ఉన్నది నిజమేనని దానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజా,పౌర సమాజ సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులను అభినందించారు.గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పాత్రికేయుల నివేశన స్థలాల సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తానని,గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి చేసిన తప్పును మరల చేయకూడదనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నట్టు ఆలస్యం అయిన త్వరలో జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.సమస్య తెలిసిన కావాలనే జర్నలిస్టులను,ఎల్ఐసి వారిని మోసం చేశారని,ప్రజా ప్రభుత్వంలో ఏలాంటి మోసం చేయకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నామని తెలిపారు.











