+91 99635 77856

బీసీలకు సగం వాటా దక్కాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

బీసీలకు సగం వాటా దక్కాలి

-బీసీలకు సగం వాటా దక్కాలి...

-హుజురాబాద్‌లో బీసీ మ్యానిఫెస్టో ఆవిష్కరణ...

హుజురాబాద్/ ఆగస్టు 04 (మా అక్షరం): జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగం వాటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందని బీసీ దళపతి, కులగణన కోసం దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమ రూపకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు.మంగళవారం పట్టణంలో బీసీ ఉద్యమ నాయకుడు బండారి సదానందం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి 'బీసీ మ్యానిఫెస్టో' పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిలోని పులులను, రోడ్డుపై ఉన్న చెట్లను, పశువులను సైతం లెక్కిస్తారని, కానీ బీసీల జనాభా లెక్కింపుపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు."మేమెంతో–మాకంతే" అనే సూత్రాన్ని దేశం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల్లోని అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శ్రీనివాస్, కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, పంజాల వెంకటేష్, సత్యనారాయణ, నేరెళ్ల మహేందర్ గౌడ్, గాలి సమ్మయ్య, పుల్ల రాధ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బీసీలకు సగం వాటా దక్కాలి…

-హుజురాబాద్‌లో బీసీ మ్యానిఫెస్టో ఆవిష్కరణ…

హుజురాబాద్/ ఆగస్టు 04 (మా అక్షరం): జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సగం వాటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుందని బీసీ దళపతి, కులగణన కోసం దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమ రూపకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు.మంగళవారం పట్టణంలో బీసీ ఉద్యమ నాయకుడు బండారి సదానందం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ‘బీసీ మ్యానిఫెస్టో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిలోని పులులను, రోడ్డుపై ఉన్న చెట్లను, పశువులను సైతం లెక్కిస్తారని, కానీ బీసీల జనాభా లెక్కింపుపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు.”మేమెంతో–మాకంతే” అనే సూత్రాన్ని దేశం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల్లోని అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శ్రీనివాస్, కూరపాటి రామచంద్రం, సంగెం శ్రీనివాస్, పంజాల వెంకటేష్, సత్యనారాయణ, నేరెళ్ల మహేందర్ గౌడ్, గాలి సమ్మయ్య, పుల్ల రాధ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !